మిర్యాలగూడ, జనం సాక్షి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని అగ్రో ఫర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వింజం రాజేంద్రప్రసాద్ కలిశారు. శనివారం ఓ కార్యక్రమానికి మిర్యాలగూడ కు వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అగ్రో ఫర్టిలైజర్స్ డీలర్స్ ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరినట్లు వింజం రాజేంద్రప్రసాద్ తెలిపారు. దీనికి గుత్తా సుఖేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.




