తుర్కపల్లి మండలం జనం సాక్షి ఏప్రిల్ 08 మండలంలో మూడవ రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్ర.ఈ యాత్ర లో భాగంగా మాధపూర్ గ్రామంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కుటుంబాన్ని కలిశారు.అనంతరం ఇస్త్రీ చేస్తూ,శేవింగ్ చేస్తూ,దర్జీ బట్టలు కుడుతూ, దోశలు,వేస్తూ వినూత్న రీతిలో యాత్ర కొనసాగించారు.ఈరకంగా ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలిపారు.ఈ ఎన్నికల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య గెలుపు ఖాయమని ప్రజలు హామీఇస్తున్నారు.ప్రజలకు మంచి చేసే నాయకుడు కావాలని ప్రజలు కోరుతున్నారు.అలాంటి నాయకుడు నియోజకవర్గంలో బీర్ల అయిలయ్య ఉన్నాడని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా నేను నాయకుడిగా కాదు సేవకుడిగా పని చేస్తానని ప్రజలకు బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు.మాధపూర్,కెవుల తండా,చిన్న లక్ష్మపూర్,నాగాయపల్లి గ్రామాల వరకు మూడవరోజు యాత్ర కొనసాగింది.యాత్రలో భాగంగా కెవుల తండాలో బీర్ల ఫౌండేషన్ సహకారం తో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు.ఈయాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




