గుత్తి కోయల్ని అడవుల నుండి వెళ్ళగొట్టడం రాజ్యాంగ విరుద్ధం
* సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు
టేకులపల్లి, నవంబర్ 28( జనం సాక్షి ): ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్యను అడ్డం పెట్టుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామస్తులను వారు ఉన్నటువంటి నివాస స్థలాలను వదిలి వెళ్ళిపోవాలని పంచాయతీ అధికారులు తీర్మానించడం రాజ్యాంగ విరుద్ధమని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
2000 సంవత్సరానికి ముందే ఆదివాసీలు తెలంగాణలోకి వచ్చి నివాస స్థలాలను, పంటచేనులను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని ,వారిని రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణ నుంచి పంపాలని ఆలోచన మంచిది కాదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఏ పౌరుడైన ఈ దేశంలో జీవించవచ్చని, వారికి హక్కులు ఉన్నాయని ఇవి గుర్తుపెట్టుకొని అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడాలని అన్నారు. ఆదివాసులకు, గిరిజనులకు జీవనాధారమైన పోడు భూములలో పంటలను సర్వనాశనం చేసి ఆదివాసీలను నగ్నంగా చిత్రహింసలకు గురిచేసి, గర్భిణీ స్త్రీలు పిల్ల తల్లులు ఆని చూడకుండా కేసులు పెట్టి జైళ్లో పెట్టి అక్రమ కేసులు బనాయించి, పంటలను ధ్వంసం చేసిన రోజు ఈ అధికారులు తీర్మానాలు ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎవరు, ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చని వారన్నారు.తక్షణమే ఎర్రబోడు ప్రజలను గ్రామ బహిష్కరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిచో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో దశల వారి కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వెంకట్రావు, రామచంద్రరావు, ఎట్టి నరసింహారావు,లాలూ తదితరులు పాల్గొన్న




