గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో మార్పులు

హైదరాబాద్‌: గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో ఆర్థిక శాక మరిన్ని మార్పులు చేసింది. ఈ మేరకు అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలకు ఆర్ధిక శాఖ కార్యదర్శి కూడా మార్పులు చేసింది. ఈ మేరకు అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలకు ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రేమ చంద్రారెడ్డి సమాచారం పంపారు. ఇప్పటివరకు గుత్తేదారులు చేసిన పనుల వివరాలను ప్రతినెలా 5 నుంచి 18వ తేదీ వరకు సంబంధిత ఇ.ఇ.లు ఈన్‌లైన్‌లో రికార్డు చేసేవారు. దీనిని 1 నుంచి 10వ తేదీగా మార్చారు. అలాగే పి.ఎ.ఓ అధికారులు గుత్తేదారులకు బిల్లుల చెల్లింపునకు సంబందించి 5 నుంచి 19వ తేదీ వరకు టోకెన్లు జారీ చేసేవారు. దీనిని కూడా 1 నుంచి 11వ తేదీగా మార్పు చేశారు. బిల్లుల చెల్లింపునకు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టినందున ఈ మేరకు మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.