గుమ్మడపల్లి గ్రామంలో జనచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు కొండమల్లేపల్లి జనవరి 12 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రం గుమ్మడవల్లి గ్రామంలో గురువారం నాడు జన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో 160వ వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా.. గ్రామంలో జన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వచించడం జరిగినది.యువజన నాయకులు కేక్ కట్ చేసి,పాటశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగినది ఈ సందర్బంగా జన చైతన్య సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ప్రసంగాలు కూడా యువకుల్లో చైతన్యం నింపేలా సాగేవి. అందుకే ఆయన జయంతి జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డే నిర్వహించాలని 1984లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. 1985 నుంచి ఏటా వివేకానందుడి ఆదర్శాలు కొనసాగేలా యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజును యువ దివస్ అని కూడా పిలుస్తారు. నేడు స్వామి వివేకానంద జయంతి సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా యువత సమస్యలను పరిష్కరించేందుకు, యువత దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వాలకు, ఇతరులకు ఇది ఒక అవకాశం. అంతర్జాతీయ యువ దినోత్సవం గౌరవార్ధం కన్సర్ట్స్, వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలను జాతీయ, స్థానిక ప్రభుత్వ అధికారులు, యువజన సంస్థలు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
భారతీయ సమాజాన్ని జాగృతం చెయ్యడమే కాకుండా పాశ్చాత్య దేశాలకు యోగ, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాలు, వాదనల ద్వారా పరిచయం చేసిన యోగి స్వామి వివేకానంద. నేటి యువతకు ఆయన ఎంతో ఆదర్శప్రాయుడు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మడవల్లి సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్, జన చైతన్య యువజన సంఘ నాయకులు కొండమీది శంకర్ డ్రీమ్ హోమ్స్ ప్లానర్ ఫయాజ్, నేతాళ్ళ నాగరాజు, రావుల శ్రావణ్ యాదవ్, గిరి శేఖర్ గౌడ్, పంగ రాము యాదవ్ మరియు గుమ్మడవల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడపల్లి గ్రామంలో జనచైతన్య యువజన సంఘం




