నిర్బంధించి రాక్షస పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
* అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
* అక్రమ అరెస్టులపై వివిధ నాయకుల ఖండన
టేకులపల్లి, జనవరి 12( జనం సాక్షి): కేసిఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల, సంఘాల నాయకులను అర్ధరాత్రి నుండే అరెస్టుల పర్వం కొనసాగిస్తూ అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లకే పరిమితం చేస్తున్న పోలీసుల తీరు చూస్తుంటే నిర్బంధించి రాక్షస పాలన ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్నాడని అరెస్టులకు గురైన కాంగ్రెస్ నాయకులు, న్యూ డెమోక్రసీ నాయకులు,తుడుందెబ్బ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తూ అక్రమ అరెస్టుల ప్రజాస్వామికమని ఘాటుగా విమర్శిస్తున్నారు.12 జనవరి 2023 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉన్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి, కాంగ్రెస్ నాయకులను, న్యూ డెమోక్రసీ నాయకులను, ఆదివాసి సంఘాల నాయకులను, ఉపాధ్యాయ సంఘాల నాయకులను ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్బంధించారు. ఈ క్రమంలో టేకులపల్లి పోలీసులు కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు, భూక్య దల్ సింగ్ నాయక్, ఉల్లోజు ఉదయ్, తుడుం దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పూనం బాలకృష్ణ, టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్, న్యూ డెమోక్రసీ తదితర నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రాలను నొక్కిపడుతూ ఏకపక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తూ వారికి కల్పించబడినటువంటి హక్కులను హరించివేస్తుంద ని అన్నారు. రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను ఈ ప్రాంతాల్లో పర్





