వికారాబాద్,మార్చి8(జనంసాక్షి): సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ఇంగ్లిష్ విూడియం ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి బి.వేణుగోపాల్ కోరారు. ఆన్‌లైన్ ద్వారా ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా పరిధిలోని మోమిన్‌పేట్,
పెద్దేముల్, కొడంగల్, బంట్వారం, కోకట్, వికారాబాద్, పరిగి, శివారెడ్డిపేట్ గురుకుల పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో 80 మంది విద్యార్థులకు ప్రవేశానికి అవకాశం ఉందన్నారు. ఎస్సీలు 75శాతం, ఎస్టీ 6శాతం, బీసీ 12శాతం, కన్‌వ్ట్గం/డ్ క్రిస్టియన్లు 2శాతం, ఈబీసీలు 2శాతం, మైనార్టీలు 3శాతం చేరవచ్చన్నారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి చదువుతూ ఉండాలని, ఓసీ, బీసీ కులాలకు చెందిన వారు 1-9-2008 నుంచి 31-8-2010లోపు పుట్టి ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారు 1-9-2006 నుంచి 31-8-2010 లోపు జన్మించి ఉండాలని చెప్పారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7వ తేదీన ఉయదం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
గురుకులాలలకు 10లోగా దరఖాస్తు చేసుకోవాలి




