హైదరాబాద్: గురుకులాల్లో పనిచేసే వారికి జీత,భత్యాలు పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి 2015-పీఆర్సీ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. సాంఘిక సంక్షేమ శాఖ పార్ట్‌టైమ్ టీచర్లకు చెల్లిస్తున్న మాదిరిగానే గిరిజన సంక్షేమ శాఖలోని పార్ట్‌టైమ్ టీచర్లకు వేతనాలు ఇవ్వాలని సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ 43శాతం భారీ ఫిట్ మెంట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.




