
మక్తల్ జూన్ 01 (జనంసాక్షి)మక్తల్ పట్టణంలోని ఎస్సీ వాడ పాఠశాల విద్యార్థిని అంకిత ఎల్లమ్మ కుంట వద్ద ఉన్న బిసి గురుకులానికి, మాధ్వార్ పాఠశాల విద్యార్థిని జ్యోతి సంగంబండ వద్ద గల ఎస్ సి గురుకులానికి ఎంపికయ్యారాని ఆయ పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు ఒక ప్రకటనలో తెలిపారు. బీద కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థినిలు గురుకుల ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 5వ తరగతిలో ప్రవేశం పొందడం చాలా అభినందనీయమని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అనిల్ గౌడ్ అన్నారు. ఎలాంటి కోచింగ్ లేకుండా వ్యక్తిగత శ్రద్ధతో మారుమూల ప్రాంతంలోని గ్రామాలలో చదువుకుంటూ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు సిద్ధమై తమ ప్రతిభను చాటుకునే విధంగా ఎంట్రన్స్ పరీక్షలను రాస్తూ గురుకుల పాఠశాలకు ఎంపికయ్యారని అన్నారు. గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులను మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని వారు కూడా గురుకులాలకు ఎంపిక కావాలని అన్నారు. అనిత జ్యోతి విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపిక కావడం పట్ల ఆయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోపాల్, నర్సిరెడ్డి ఉపాధ్యాయులు రవీందర్, శ్రీనివాసరావు, రామాంజనేయులు, వనజ, బాబు తదితరులు హర్షం




