జనం సాక్షి, కమాన్ పూర్ : కేశోరామ్ సిమెంట్ పర్మనెంట్ కార్మికుల గుర్తింపు సంఘం గత 20 సంవత్సరాలు నుండి కాలపరిమితి రెండు సంవత్సరాల మాత్రమే ఉండే కాలపరిమితి ఇప్పుడు మూడు సంవత్సరాలు చేయడం పర్మనెంట్ కార్మికుల హక్కులను కాలరాయడమే అవుతుందని, పర్మినెంట్ కార్మికుల అభ్యర్థన మేరకు రెండు సంవత్సరాలు మాత్రమే కాలపరిమితి ఉండాలని పర్మనెంట్ కార్మికుల సమక్షంలో మేనేజ్మెంట్ వారితో మంగళవారం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య చర్చించారు. కేశోరామ్ పర్మినెంట్ కార్మికుల అభ్యర్థన మేరకు ఏ గుర్తింపు సంఘం రెండు సంవత్సరల కాలపరిమితి మాత్రమే ఉండాలని కార్మికుల సమక్షంలో మేనేజ్మెంట్ వారితో సూర సమ్మయ్య మాట్లాడారు. రెండు రోజులలో ఏ గుర్తింపు సంఘం అయిన రెండు సంవత్సరాల అగ్రిమెంట్ చేయాలని లేనియెడల న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పర్మినెంట్ గుర్తింపు సంఘం ఎన్నికలలో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క పర్మినెంట్ కార్మికునికి సూర సమ్మయ్య ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు
గుర్తింపు సంఘం కాల పరిమితి పెంచితే న్యాయ పోరాటం చేస్తా – కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షుడు సూర సమ్మయ్య




