Thursday, 5 November 2026

ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ప్రతిభ పాఠవ పోటీ

లుఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ప్రతిభ పాఠవ పోటీలు
జనం సాక్షి,చెన్నారావు పేట
విద్యార్థులు గణితాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సైన్స్  సెంటర్ ఫీల్డ్‌ కోఆర్డినేటర్ సాయిని అశోక్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలిచే నిర్వహించబడుచున్న హనుమకొండలోని హంటర్ రోడ్ నందు గల రీజినల్ సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఉత్సవాలలో భాగంగా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణితం పై వివిధ రకాల పోటీలను నిర్వహించి, బహుమతులను ప్రధానం చేశారు.ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం కె.ఫ్లోరెన్స్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రీజినల్ సైన్స్ సెంటర్ ఫీల్డ్ కోఆర్డినేటర్ సాయిని అశోక్ కుమార్ మాట్లాడుతూగణితాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవడం నేర్చుకోవాలని, గణిత సమస్యల సాధన ద్వారా నిత్యజీవితంలో అనేక సమస్యలను పరిష్కరించవచ్చని,విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి గణిత పోటీలు సహకరిస్తాయన్నారు.రీజినల్ సైన్స్ సెంటర్లో 69 రకాల ఎగ్జిబిట్లు ఉన్నాయని, విద్యార్థులందరూ రీజినల్ సైన్స్ సెంటర్ ను సందర్శించాలని, ప్రయోగాత్మకంగా సైన్స్ అంశాలను గురించి తెలుసుకోవాలన్నారు, ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైన్స్ సెంటర్ సందర్శనకు అవకాశం  కలగ చేస్తామన్నారు.రీజినల్ సైన్ సెంటర్ సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ బి.కీర్తి వివేక్ మాట్లాడుతూ అడవులు, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక మండలి ద్వారా స్థాపించబడిన రీజనల్ సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఓజోన్ దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, సైన్స్ దినోత్సవం, గణిత దినోత్సవం సందర్భంగా పలు రకాల పోటీలను నిర్వహించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు.ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం కె.ఫ్లోరెన్స్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీనివాస రామానుజన్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు గణిత సమస్యల సాధనలో కృషి చేయాలని కోరారు. విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికితీయడానికి పాఠశాలలో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.పాఠశాలనందు వివిధ తరగతుల విద్యార్థులు తయారు చేసిన గణిత సంబంధ నమూనాలు, ప్రాజెక్టులు , వివిధ రకాల చార్ట్ లను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడం జరిగింది. తదనంతరం గణితం పై ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు.క్విజ్ పోటీలో విజేతలుగా ప్రభాస్, నీతూ ప్రియా, ఆమని, జస్వంత్, సాత్విక్, ఈశ్వర్, గణిత రంగోలి పోటీలలో కీర్తి ప్రసన్న, అఖిల ఉపన్యాస పోటీలలో ప్రభాస్, సిద్ధార్థలను విజేతలుగా ప్రకటించి సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో సాయిని అశోక్ కుమార్, కీర్తి వివేక్ బహుమతులను అందజేశారు.ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులు పర్వత రమణారావు, గొడుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించినక్విజ్ పోటీలకు జడ్జిగా కె.మోహన్ రావు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.రమణారావు,జె.ఉమారాణి , జి.శ్రీనివాస్,కె.సంతోష్ కుమార్,పిన్నింటి  బాలాజీ రావు, ఏ.ఉదయ్ కుమార్, సిహెచ్. మాధవి, వి.మమత, ఆమంచ రవికుమార్,కె.మాధవి, జి.సుందర్, టి.మురళి, బి.రవీందర్,ఓ. కృష్ణ, కె.మోహన్ రావు, ఏ.నీల,క్రాఫ్ట్ టీచర్ చింతకింది  ఇందిర, జూనియర్ అసిస్టెంట్ ఎండి జాహెద్ లు పాల్గొన్నారు.