Wednesday, 4 November 2026

గుర్రం అప్పిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

 

 

 

 

హుజూర్ నగర్ మే 27 (జనంసాక్షి): పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన గుర్రం అప్పిరెడ్డి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, అట్లూరి హరిబాబు, ఫణి కుమారి, కిరణ్, సునీల్, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.