హైదరాబాద్: 2004 తర్వాత గూగుల్ ట్రెండ్స్‌లో భారతీయ ప్రాంతీయ భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉన్నట్లు ఒక పరిశోధన పేర్కొంటోంది. హిందీ, తమిళం మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. అమెరికాలో చూస్తే తమిళం, తెలుగు మాట్లాడే వారు అక్కడ నివసిస్తుండడంతో రెండూ దాదాపుగా సమంగా ఉన్నాయట. తెలుగు ప్రజాదరణకు ప్రధాన కారణం తెలుగు సినిమాలే కావచ్చని సెర్చ్ ఇంజిస్ అప్టిమైజేషన్ నిపుణులు పేర్కొంటున్నారు. సెర్చ్ చేసేటపుడు వాడే కీ వర్డ్స్ ఆధారంగా వారీ నిర్ణయానికి వచ్చారు.




