కొత్తగూడెం : మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడి, జైలుకి వెళ్లిన ఓ ప్రభుద్ధుడి సంఘటన మరువక ముందే కొత్తగూడెంలో మరో సంఘటన వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి… స్థానిక మధురబస్తీకి చెందిన హబీబ్ అనే డ్రైవర్ తన ఇంటి సమీపంలోని 9 ఏళ్ల మైనర్ బాలికకు చాక్లెట్లు ఇప్పిస్తానని మాయామాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో భయపడి తలుపులు తెరిచాడు. దీంతో చిన్నారి ఇంటికి పరుగులు తీసింది. సంఘటన జరిగిన రోజు చిన్నారి తండ్రి ఊర్లో లేకపోవడంతో, మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన తండ్రికి విషయం తెలిపింది. దీంతో చిన్నారి తండ్రి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హబీబ్‌పై పోక్సో యాక్ట్ కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ మడత రమేష్ తెలిపారు.





