Thursday, 5 November 2026

గొంతులో చేప ఇరుక్కొని యువకుడి మృతి

హైదరాబాద్‌: గొంతులో చేప ఇరుక్కొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన కేరళలోని పాలక్కాడ్‌లో చోటుచేసుకుంది. బేకరీలో పనిచేసే దినేశ్‌ అనే యువకుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి చెట్టిలంచెర్రి గ్రామంలోని నీలిచిర ప్రాంతానికి చేపలవేటకు వెళ్లాడు. అక్కడ ఒక చేప పట్టుకొన్నాడు. ఇంతలో నీటిలో మరో చేప కన్పించడంతో చేతిలోని చేపను నోటితో ఒడిసి పట్టుకుని మరో చేపను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ హడావుడిలో నోట్లోని చేప లోపలికి జారి గొంతుకు అడ్డం పడింది. వైద్యుడి వద్దకు తరలించేలోపే దినేశ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *