ఫొటో : కంటివెలుగు ప్రారంభిస్తున్న సర్పంచ్.
నెన్నెల, మార్చ్ 21, (జనంసాక్షి )
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో మంగళవారం సర్పంచ్ ఇందూరి శశికళ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని అందరికి కంటి చూపు సరిగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ కంటివెలుగు ద్వారా మెరుగైన కంటిచూపును పొందవచ్చాన్నారు. గ్రామంలోని ప్రజలందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో కంటివెలుగు మెడికల్ ఆఫీసర్ భవాని, సింగల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్, పంచాయతీ కార్యదర్శి మద్దివేణి రంజిత్, ఉప సర్పంచ్ జాడి నారాయణ, కంటివెలుగు సిబ్బంది, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గొల్లపల్లిలో కంటివెలుగు ప్రారంభం.




