అలరించిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సభ.పది పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలి.స్థానిక సర్పంచ్ జ్యోతి.
కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనిస్థానిక సర్పంచ్ జ్యోతి,కారెగాం హై స్కూల్,ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సూర్య కుమార్,మేకల నాగరాజు పేర్కొన్నారు.మంగళవారం పొతంగల్ మండలం కారేగాం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదవతరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సభ పలువురిని ఆకట్టుకుంది.ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు చూపరులను అలరించాయి.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.పదవ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలను సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు,గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు.అలాగే విద్యార్థులు కృషి, పట్టుదల,క్రమశిక్షణతో కలిగి ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.అనంతరం విద్యార్థులకు భోజన వసతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఎస్ఎంసి ఛైర్మెన్ సాయిలు,ప్రైమరీ స్కూల్ ఎస్ఎంసి ఛైర్మెన్ ఉత్తం,గ్రామ పెద్దలు లక్ష్మణ్ పటేల్,పిఅర్టియు కోటగిరి మండల అధ్యక్ష, కార్యదర్శి బాధ్యులు గంగరాజు,కృష్ణమోహన్,పిఅర్టియు జిల్లభాద్యులు ఉదయ్ చందర్,ప్రజా ప్రతినిధులు,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,విద్యార్థిని, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
అలరించిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సభ.




