నెన్నెల, జూన్ 5, (జనంసాక్షి )
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ ఇందూరి శశికళ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ ఇందూరి శశికళ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పర్యావరణ దెబ్బతిని, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుందని అన్నారు. చెట్లను పెంచడం పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుందని అన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మద్దివేణి రంజిత్, ఉపసర్పంచ్ జాడి నారాయణ, వార్డు సభ్యులు గంగమల్లు, శ్రీను, ప్రమోద్, అంగన్వాడీ కార్యకర్తలు రాజమణి, సుజాత, సింగల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్, గ్రామ పెద్దలు మొగిలి, పోశం, రాజేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
గొల్లపల్లిలో పర్యావరణ దినోత్సవం.




