Monday, 2 November 2026

గొల్లపల్లిలో సామాజిక తనిఖీ గ్రామ సభ.

గొల్లపల్లిలో సామాజిక తనిఖీ గ్రామ సభ.
నెన్నెల, డిసెంబర్ 1, (జనంసాక్షి )
మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఉపాధి హామీ సామజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా 2019 నవంబర్ నుండి 2022 మార్చ్ వరకు జరిగిన పనులకు సంబందించిన సామాజిక తనిఖీ బృందం తరుపున తనిఖీ నిర్వహించారు. వాటివాటి వివరాలను గ్రామ సభలో చర్చించారు. ఈ గ్రామసభలో సర్పంచ్ ఇందూరి శశికళ, సీఆర్పీ జగన్, డిఆర్పీ శ్రీనివాస్, ఏపీవో నరేష్, పంచాయతీ కార్యదర్శి రంజిత్, టెక్నీకల్ అసిస్టెంట్ అశ్విని, ఉప సర్పంచ్ జాడి నారాయణ, సింగల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్, వార్డ్ సభ్యులు గంగమల్లు, ప్రమోద్, శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.