Thursday, 5 November 2026

గోడపై సూసైడ్ నోట్ రాసి పెయింటర్ ఆత్మహత్య బిచ్కుందలో విషాదం

గోడపై సూసైడ్ నోట్ రాసి పెయింటర్ ఆత్మహత్య
బిచ్కుందలో విషాదం
బిచ్కుంద జనవరి 13 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రానికి చెందిన నక్కమూతి హన్మాండ్లు అలియాస్ చిన్న (35) అనే యువకుడు తన ఇంట్లోని ఫ్యాన్ కు చున్నీతో ఉరివేకొని శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి భార్య, అత్త, మమలు, బావమరిదితో పాటు జుక్కల్ లోని ఓ ప్రయివేట్ పాఠశాలలో టీచరే కారణమంటూ, ఇంటి గోడలపై సూసైడ్ నోట్ రాయడం గమనార్హం. ఈ సంఘటన పలువురిని కలిచి వేసింది. ఇదిలా ఉండగా మారిన వ్యక్తిది హత్య, లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.