Thursday, 5 November 2026

కే ఓసి లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు వాహనం తగిలి మృతి

కే ఓసి లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు వాహనం తగిలి మృతి

టేకులపల్లి,జనవరి 13 (జనం సాక్షి): ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓసి లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న నక్క శ్రావణ్ కుమార్(23) వోల్వో షావల్ వాహనం ప్రమాదవశాత్తు తగిలి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఖమ్మం తరలించి మమత వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి కోయగూడెం ఓసి ఫిట్ -3 లో జరిగింది. పాల్వంచ సమీపంలోని నాగారం గ్రామానికి చెందిన మృతుడు నక్క శ్రావణ్ కుమార్ సుమారు 6 నెలల క్రితం కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వోల్వో షావల్ కు శ్రావణ్ కుమార్ డీజిల్ ఫిల్ చేశాడు. ఆ తరువాత వోల్వో షావల్ ఆపరేటర్ అజాగ్రత్తగా డీజిల్ ఫిల్ చేసిన శ్రావణ్ కుమారుని వెనుక నుండి తగిలించడంతో తీవ్ర గాయాలయ్యాయి. సంబంధిత కంపెనీ ఇన్చార్జి ఖమ్మం వైద్యశాలకు తరలించారు. మృతుడు శ్రావణ్ కుమార్ కు ఇంకా వివాహం కాలేదు. ఖమ్మంలో పోస్ట్మార్టం అనంతరం మృతుని స్వగ్రామం నాగారంకు తరలించారు.

*టేకులపల్లి ఓసి లో చనిపోయిన కార్మికునికి
కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియ చెల్లించాలి:

* సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఐఎఫ్టీయూ డిమాండ్
టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఓసి లో పనిచేస్తున్న డీజిల్ వర్కర్ నక్క శ్రావణ్ కుమార్ రాత్రి వాహనాల కు డీజిల్ కోడుతుండగా పక్కనున్న వాహనం తగిలి రక్తo కారుతుండడంతో ఖమ్మం తరలించగా ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందాడు. సింగరేణి, మేనేజ్మెంట్ నిర్లక్ష్యం తో ఈ ప్రమాదం సంభవించి కార్మికుడు మృతి చెందాడని,మృతి చెందిన శ్రావణ్ కుమార్ కి 50 లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియ, వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి, ప్రభుత్వ బెనిఫిట్ లు కల్పించాలని,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్