…
భైంసా రూరల్ జనవరి 23 జనం సాక్షి
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో దూకి ఓ తల్లి తనఇద్దరు పిల్లలతో సహా దూకిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.పిల్లలు ఇద్దరినీ స్కూల్ నుండి తీసుకుని వచ్చి వాళ్ళబ్యాగ్ లను గోదావరి ఘాట్ వద్ద మెట్లపై వదిలి ఆత్మహత్య కి పాల్పడ్డారు. సీఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ…నిజమాబాద్ గోల్ హనుమాన్ పెద్ద బజార్ కు చెందిన బాలాదిత్య (8) భవ్యశ్రీ (5) మానస (27) గా గుర్తింపు గా తేలిందని తెలిపారు.మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. క్షణికా ఆవేశం లో ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దని తెలిపారు.సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేవాలను బయటికి తీశారు. దర్యాప్తును ప్రారంభించారు.




