వరంగల్ బ్యూరో, జనవరి 23 (జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్ లో సోమవారం ఉదయం ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శాల ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ప్రయాణికులు ఆటో డ్రైవర్లు హమాలీ కార్మికులు మొదలైన 316 మంది కి వైద్య పరీక్షలు చేసి వారికి కావలసిన ఆయుర్వేద మందులను అందించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యశాల సూపరింటెండెంట అనిశెట్టి శ్రీధర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంలో అన్ని రకాల జబ్బులకు శాశ్వత పరిష్కారం ఉందని, ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని. కోరారు ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ శ్రీనివాస్, ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ప్రిన్సిపాల్ విజయ్ గణేష్ రెడ్డి, వైద్యులు దుర్గాబాయి, అశోక్ కుమార్, అమృత, శిరీష ,మధు, హిరన్మై, మైదం రాజు, జ్యోతి, కుమారస్వామి, జమీల్, వీరన్న, రజిత, ఆఫ్గర్ పాషా అరవింద్ రాజ్, అక్షయ్ రావు కళ్యాణ్, సంధ్య, శ్రావణి, కస్తూరి మొదలైన వారు పాల్గొన్నారు




