Wednesday, 4 November 2026

గోదావరి కరకట్ట కావాలని డిమాండ్.

గోదావరి కరకట్ట కావాలని డిమాండ్.

– సిపిఎం పార్టీ బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో…

– సుందరయ్య గ్రామం, మసీదు రోడ్డు ప్రజలు.

బూర్గంపహాడ్ నవంబర్ 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక సుందరయ్య నగర్, మసీదు రోడ్డు ప్రజలు గోదావరి కరకట్ట కావాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేము మండలంలో జులై నెలలో వచ్చిన గోదావరి వరదకి గురైన గ్రామాలు గోదావరికి కరకట్ట కట్టించాలని ప్రజలు కోరుతున్నామన్నారు. మేము ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లి పోయేది లేదని సుందరయ్య నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీ మంచినీరు కరెంటు అభివృద్ధి చెందిన గ్రామాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోయేది లేదని మేము ఈ ప్రాంతంలోనే ఉంటామని కరకట్ట ప్రభుత్వం నిర్మించాలని, 1200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, వెంటనే ఈ ప్రాంతం కరకట్ట ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని డిమాండ్ చేశారని తెలియజేశారు. మేము మెరక ప్రాంతాలకు కానీ ఇంకో ప్రాంతానికని వెళ్లే పరిస్థితి లేదని అన్నారన్నారు. మొత్తం గ్రామస్తులు ముక్తకంఠం తో సుందరయ్య నగర ప్రజలు తెలిపారన్నారు. అడ్డరోడ్డు ప్రాంతానికి ఎవరూ ఇల్లు ఉన్నవారు వెళ్ళట్లేదని, ఇంటి స్థలం ఇల్లు లేని నిరుపేదలు వెళ్లారని, వారికి ప్రభుత్వం సర్వే చేసి నిజమైన నిరుపేద కుటుంబాలకు స్థలం లేని కుటుంబాలని ఎంపిక చేసి వారికి ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉందని, డబల్ బెడ్ రూమ్ కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఉన్నవారికి ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, ఎస్.కె అబిదా, పాలపాటి వేణు, విలాసాగర్ రజిని, నూర్జాన్, చంద్ర, గామాలపాటి రమేష్ ,బందెల లక్ష్మణరావు, బత్తుల ఏడుకొండలు, గుండం గట్టు అప్పారావు, టి కుమార్, పవన్, దాసు, నాగమణి ,తదితరులు పాల్గొన్నారు.