లోకకళ్యాణార్థం జరుగుతున్న చండీ హోమం నాంపల్లి ఎంపీపి ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి కొండమల్లేపల్లి నవంబర్ 7జనం సాక్షి న్యూస్ :
లోక కళ్యాణార్థం కొరకు జగన్మాత ఆశీస్సులతో ప్రతి పౌర్ణమికి చండీ హోమం చేయు సంకల్పంలో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా రేపు గ్రహణం ఉందన్న ఉన్నందున ఈరోజు హస్తినాపురంలో ద్వారక నగర్ లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం జరిగింది. శ్రీ రేణుక రాజరాజేశ్వరి పీఠాధిపతి శ్రీ మోల్లూరి నవీన్ శర్మ గారి సమక్షంలో చండీ హోమం ఘనంగా నిర్వహించామని నాంపల్లి మండల ఎంపీపీ శ్రీమతి ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి తెలియజేశారు.
ప్రతి నెల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని అమ్మ వారి ఆశీస్సులతో ఈ చండీయాగం ప్రతినెల నిర్వహిస్తామని రవీందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పోగుల వెంకటరెడ్డి దంపతులు మరియు నడింపల్లి యాదయ్య దంపతులు, ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి దంపతులు మరియు చండి హోమ సభ్యులు, చండీ సేన సభ్యులు, భక్తజనులు పాల్గొన్నారు.
లోకకళ్యాణార్థం జరుగుతున్న చండీ హోమం నాంపల్లి ఎంపీపి ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి కొండమల్లేపల్లి నవంబర్




