Friday, 6 November 2026

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

91 హైద‌రాబాద్ (జ‌నంసాక్షి)

గోదావరి పుష్కరాలను కనీవినిఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయన్నారు. భక్తుల సౌకర్యాల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సారి పుష్కరాలకు దాదాపు 6కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశముందన్నారు. గత ప్రభుత్వాలు పుష్కరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్న మంత్రి.. ఈ సారి భక్తుల సౌకర్యం కోసం 180కోట్లతో బీటీ రోడ్లు, 83 కోట్లతో స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *