![]() |
యాదగిరిగుట్ట, మార్చి 16: తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట ఆలయంలో సోమవారం లక్షపుష్పార్చన ఘనంగా జరిగింది. ఫాల్గుణ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని లక్షస్తోత్ర నామాలతో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి నిత్య కైంకర్యాలు, నారసింహ సుదర్శన హోమం, నిత్యకల్యాణం సంప్రదాయరీతిలో జరిగాయి.





