Friday, 6 November 2026

గోపాల్‌ గోయల్‌ కు ముందస్తూ బేయిల్‌

న్యూఢిల్లీ: మాజీ ఎయిర్‌హోస్టెన్‌ గీతికా శర్మ అత్మహత్య కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హర్యానా మాజీ మంత్రి గోపాల్‌గోయల్‌ కందా గురువారం ఢిల్లీలో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలిని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అతి సున్నిత మనస్కురాలైన గీతికా శర్మకు తన పట్ల ప్రేమ, ద్వేషం అనే మిశ్రమ భావనలు ఉండేవని తన వ్యాజ్యంలో గోపాల్‌ పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖను ప్రస్తావించారు. అందులో తన గురించి ప్రతికూలంగా రాయలేదని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *