హైదరాబాద్, సెప్టెంబరు 18 : గోల్కొండ పోలీసుస్టేషను పరిధిలో కాంగ్రెస్ నాయకుడు జబ్బార్ పటేల్ తనను బెదిరించాడని మహ్మద్ ముజామిల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని ముజామిల్ ఆరోపించారు. కాగా గోల్కొండలో కాల్పులు జరగలేదని వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఫరీద్‌ను జబ్బార్ కొట్టడం వల్లే ఫైరింగ్ చేశాడని ఆరోపించారని డీసీపీ వివరించారు.




