గౌడ బీమా అమలు చేయాలి*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 03,
(జనంసాక్షి)
నిత్యం ప్రమాదాలతో చెలగాటమాడుతూ పనిచేస్తున్న గీతా కార్మికులకు గౌడ బీమా అమలు చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు రంగు రామగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు మెట్పల్లి పట్టణ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు శనివారం వినతి పత్రం అందజేశారు.
జిల్లా లోని పేద గౌడ విద్యార్థుల కోసం హాస్టల్ వసతి కల్పనకు 10 ఎకరాల భూమిని కేటాయించి, భవన నిర్మాణం చేపట్టాలని,ఈత తాటి చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని అదే విధంగా ఎస్సారెస్పీ కాలువగట్లు, చెరువులు, వర్ధకాలువ గట్లపై ఈత తాటి చెట్ల పెంపకానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.గీత కార్మికుల పోట్ట కొడుతున్న చీఫ్ లిక్కర్‌ను రద్దు చేయాలని గ్రామాల్లో బెల్ట్ షాపులను మూసి వేయాలని పేదలైన ప్రతి గౌడ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కొప్పుల ఈశ్వర్ ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తామన్నారు. గీత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ
రాష్ట్ర ఉపాధ్యక్షులు చర్లపల్లి రాజేశ్వర్‌గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కట్ట నరస గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి నాయిని శ్రీనివాస్ గౌడ్ మెట్పల్లి,ఇబ్రహీంపట్నం మండలాల అధ్యక్షులు ఏపూరి శ్రీనివాస్ గౌడ్,నేరెళ్ల సుభాష్ గౌడ్ నాయకులు గోపి గౌడ్,కట్ట ఆంజనేయులు గౌడ్, భువనగిరి శ్రీనివాస్ గౌడ్, కట్ట శ్రీనివాస్ గౌడ్,కట్ట రవీందర్ గౌడ్,కిషోర్ గౌడ్, కట్ట మధు తదితరులు పాల్గొన్నారు




