విద్యార్థులు విద్య విజ్ఞానం వైపు అడుగులు వేయాలి మున్సిపల్ చైర్మన్ మనోరమ
అలంపూర్ జనంసాక్షి (డిసెంబర్ 3) విద్యార్థులు విజ్ఞానవైపు అడుగులేస్తూ తాత్కాలిక ఆనందాలకు బానిసరి కావద్దని అలంపూర్ మున్సిపల్ చైర్మన్ మనోరమ అన్నారు. అలంపూర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో శనివారం వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు, జూనియర్ కళాశాల విద్యార్థులకు విద్య,వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ మనోరమ హాజరైయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు సమాజం పట్ల అవగాహన కల్పించుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తిత్వ వికాసం వల్ల విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు రావడంతో పాటు, విద్యా విజ్ఞానం వైపు నడిచే అవకాశం ఉంటుందన్నారు. చదువుల్లో రాణించి మంచి పేరు సంపాదించుకోవాలన్నారు.అనంతరం కార్యక్రమానికి ప్రధాన వ్యక్తి రామకృష్ణ మఠం హైదరాబాద్ మాస్టర్ మోటివేటర్ వ్యక్తిత్వ వికాస నిపుణులు సయ్యద్ అల్ కలాం మజీద్ విద్యార్థులకు విలువైన సందేశాన్ని అందించారు. సినిమాలు టీవీలు, సెల్ ఫోన్లు తాత్కాలిక సంతోషాన్ని కలిగించవచ్చు కానీ జీవితం రంగుల కల కాదని వాటిని దూరం చేస్తూ విద్యా విజ్ఞానం వైపు అడుగులు వేయాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే ధైర్యంగా చెబుతూ పరిష్కరించుకోవాలన్నారు . మనిషి జీవితంలో మార్పును కోరుకోవాలని అది సమాజానికి మంచిని పంచేదిగా ఉండాలన్నారు. ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఆలోచించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల జీవితాలు తెల్ల కాగితాలు అని అందులో విలువైన అంశాలనే రాసుకోవాలని సూచించారు. మంచి వాళ్లతో స్నేహం చేయడం తో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. సమాజానికి విలువలతో కూడిన విజ్ఞానాన్ని పంచేందుకు విద్యార్థులు ఎదగాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమం లో వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు,కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి, అధ్యాపకులు మదన్మోహన్, సృజన, మహేందర్, రామచంద్రయ్య, వెంకటయ్య, రఘువీర్,రాముడు ,ఫమిన, వేణు ,శారద , అనీఫ్, సుగుణమ్మ, రుమానా పర్వీన్, మాబు సాబ్, కవిత రాణి, పుష్పలత ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు విద్య విజ్ఞానం వైపు అడుగులు వేయాలి మున్సిపల్ చైర్మన్ మనోరమ




