హైదరాబాద్ సిటీ: గ్యాలరీ స్పెస్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈశాన్య భారతంలో ప్రముఖంగా ఉన్న ఎస్సెల్ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొట్ట మొదటిసారిగా నిర్వహించిన ప్రదర్శనకు మంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు వాహిదా అహ్మద్ తెలిపారు. ఈ వేదికపై తమకు అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. దేశ, విదేశాల్లో ఫౌండేషన్ ద్వారా చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.




