గ్యాస్ కేటాయింపులో ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ
ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. గ్యాస్ కేటాయింపులో రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆయన ప్రధానిని కోరారు. ఉదయం నుంచి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆయన వివరణ ఇచ్చారు.