Tuesday, 3 November 2026

గ్రామపంచాయతీల అభివృద్ధికి నూతన పనులు అంచనాలు రూపొందించాలి. ఎంపీడీవో జ్యోతిలక్ష్మి.

 

 

 

 

మిర్యాలగూడ,జనం సాక్షి. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో భాగంగా చెప్పటాల్సిన పనులు, అంచనాలను రూపొందించాలని మిర్యాలగూడ మండల అభివృద్ధి అధికారిణి గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సంగీత సాంకేతిక నిపుణులు, క్షేత్ర సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామపంచాయతీలలో చేపట్టి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి, వ్యయ అంచనాలను రూపొందించాలని కోరారు.
ప్రతి గ్రామపంచాయతిలో ప్రతి రోజు 150 కూలీలతో పని చేయించాలని,ప్రతి గ్రామపంచాయతిలో ప్రతి వర్క్ సైట్ కి ఎన్ ఏం ఏం ఎస్ హాజరు 100 జరిగేలా చూడాలన్నారు, ఉపాది హామీలో జరిగే పనులకు కొలతల ప్రకారం పని చేయించి సమాన వేతనం 272/-వచ్చేలా ఇచ్చి పనులు చేయించాలన్నారు, ప్రతి గ్రామపంచాయతిలో గ్రీన్ ప్లాన్ ప్రకారం మొక్కలు ఎంపిక చేసుకోవాలి ప్రతి గ్రామపంచాయతీ నర్సరీలలో 100 శాతం జర్మినేషన్ వుండాలని సూచించారు. అదేవిధంగా ప్రతి గ్రామపంచాయతిలో ఉన్న కాంపోస్ట్ షెడ్ లో కాంపోస్ట్ నిర్మాణం ఒక్క వారం లో పూర్తి చేయాలని,ప్రతి గ్రామపంచాయతి స్మశాన వాటికలను వాడుకలోకి తీసుకరావాలని అక్కడ వచ్చే వారికి నీళ్ళు నీళ్ళు,కరెంట్ ,సదుపాయలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు,
ప్రతి గ్రామ పంచాయతిలో క్రీడా ప్రాంగణ స్థలాలు ఎంపిక చేసి అంచనాలు తయారు చేసి పనులను త్వరగా పూర్తి త్వరగా పూర్తి చేయాలన్నారు..ప్రతి గ్రామం లో వేసవి కాలం కాబట్టి మంచి నీటి సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదిగిన చర్యలు చేపట్టాలన్నారు.జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో ఉన్నందున అభివృద్ధి పనులకు ఎలాంటి భంగం కలగకుండ మండల కార్యాలయ సిబ్బంధి కి అధనపు భాధ్యతలు ఇవ్వడం జరిగిందని వివరించారు.
ఈ కార్యక్రమములో యం.పి.వో టి.వీరారెడ్డి టిఏ లు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, మెట్ లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.