జనం సాక్షి /కొల్చారంముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం లాంటిదనిమహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి.. కొల్చారం జడ్పిటిసి సభ్యురాలు ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు… గురువారం నాడు వరిగుంతం గ్రామానికి చెందిన.. లూనావత్ సునీత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని సునీత లక్ష్మారెడ్డికి తెలియజేయడంతో.ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 48 వేల రూపాయల చెక్కును.. లబ్ధిదారులకు అందజేసినట్లు సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో. మండలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు. జరిగాయని అన్నారు… ఈ కార్యక్రమంలో కొల్చారం సర్పంచ్ కరెంటు ఉమాదేవి రాజా గౌడ్. పాండ్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు…




