గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు యూత్ కాంగ్రేస్ సంఘిభావం

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎంపీడీవో కార్యాలయం వద్ద గత 7 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు యూత్ కాంగ్రెస్ నాయకులు బుధవారం సంఘీభావం తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీ కార్మికులను పర్మనెట్ చెయ్యాలి అని, పిఆర్సి లో నిర్ణయించిన విధంగా జీతాలు చెల్లించాలని , మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే పది లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు యూనిఫామ్, చెప్పులు నూనెలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులు ఎరుకల ప్రవీణ్ , అజింఖాన్, ఆర్ల నాగరాజు, దోరగొర్ల శ్రీనివాస్, ముజిబ్, గొల్లపల్లి శ్రీనివాస్, తాళ్లపల్లి సత్య నారాయణ,ఎరుకల మోహన్ సాయి, బడికెల మనోజ్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు