గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలి
…. మమ్మల్ని అన్యాయంగా అరెస్టు చేశారు.. నిడిగొండ శ్రీనివాస్
బచ్చన్నపేట జనవరి 2 (జనం సాక్షి) గ్రామపంచాయతీ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ అక్కుల సాధన కోసం టి పి సి సి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్. ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నాకు వెళుతుంటే ముందస్తుగా బచ్చన్నపేట పోలీసులు అరెస్టు చేశారని స్టేట్ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోడూరు మహాత్మ చారి అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులను దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసి.. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల గురించి విడుదల చేయాల్సిన 250 కోట్ల రూపాయలు 7 నెలలుగా నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. అరెస్టు అయిన వారిలో
స్టేట్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ కోడూరీ మహాత్మా చారి, ఓబీసీ జిల్లా వైస్ చేర్మైన్ చెరుకూరి శ్రీనివాస్ టౌన్ వయిస్ ప్రెసిడెంట్ అల్వాల రమేష్ కనక రాజు గౌడ్ . ఉన్నారు




