Thursday, 5 November 2026

గ్రామాభివృద్దే ద్యేయం : జగన్ గూడ సర్పంచ్ విష్ణు

గ్రామాభివృద్దే ద్యేయం : జగన్ గూడ సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి :గ్రామ మౌళిక వసతుల కల్పనకు అహర్నిశలు పాటుపడుతున్నామని జగన్ గూడ సర్పంచ్ చందు పట్ల విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం సంపన్ బోల్ గ్రామంలోని 10వ వార్డులో 5 లక్షల రూపాయలతో మంత్రి మల్లారెడ్డి నిధులతో సిసి రోడ్డు వేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ బుద్ది శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
23ఎస్పీటీ -2: సిసి రోడ్డు ప్రారంభిస్తున్న సర్పంచ్