Tuesday, 3 November 2026

గ్రామాలకు బొడ్రాయిలు మూల స్థంభాలు… ఎమ్మెల్యే  ఎమ్మెల్యే  రెడ్యా నాయక్

డోర్నకల్ ప్రతినిధి ఫిబ్రవరి 27 (జనం సాక్షి): గ్రామాలకు బొడ్రాయిలు మూలస్థంభాలుగా పిలుస్తారని  డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తెలిపారు. సోమవారం నరసింహుల పేట మండలంలోని బక్కతుండ గ్రామపంచాయతీ శివారులో  గతమూడు రోజుల నుంచి బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు స్థానిక సర్పంచ్‌  ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
చివరి రోజు ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే  రెడ్యా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బొడ్రాయి ఊరిమద్యలో ఉంటు గ్రామ ప్రజలకు కంటికిరెప్పల కాపాడు తుందన్నారు. అలాంటి బొడ్రాయి గ్రామంలో పూర్వకాలం నుంచి ఉంటుందన్నారు.
కొన్ని గ్రామాలలో మనుగడలో లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజలు కలిసి నూతనంగా ప్రతిష్టాపన చేస్తున్నారు.  గ్రామంలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినంధనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు స్థానికులు రైతులు పాల్గొన్నారు.