శామీర్ పేట్, జనం సాక్షి :సోమవారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ భారత స్వాతంత్ర్య సమర యోధులు చంద్ర శేఖర్ ఆజాద్ 92 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. భారత స్వాతంత్ర్య సమర యోధులు భగత్ సింగ్,రాజ్ గురు ,సుఖదెవ్ , పండిత్ రాం ప్రసాద్ బుస్మిల్,ఠాకూర్ రోషన్ సింగ్ ప్రేమ్ కిషన్ ఖన్నా ,ఆశ్ఫాక్ ఉల్లా ఖాన్ ల తో సాంగత్యం లో ఉండే వారని , ఆయన ఆంగ్లేయుల చేతి లో చనిపోవటం ఇష్టం లేక తన్ను తాను కాల్చుకొని చనిపోయారని అన్నారు. ఆయన ఆదర్శాలను అనుసరించాలని అఫ్జల్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మేడ్చల్ జిల్లా కేసీఆర్ సేవాదళం ఆర్గనైజింగ్ కార్యదర్శి బత్తుల శశికాంత్ యాదవ్, మేడ్చల్ జిల్లా కేసిఆర్ సేవాదళం కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, లక్ష్మయ్య, యాదగిరి, వసీం అక్రం, బాబు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆజాద్ వర్ధంతి వేడుకలు




