Thursday, 5 November 2026

గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి పరచడమే నా లక్ష్యం

 

మల్దకల్ జనవరి 20(జనంసాక్షి)మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ లక్ష్మన్న గ్రామ సభకు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపిపి వై.రాజారెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో బిజ్వారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు డెబ్బై నాలుగు లక్షలతో ప్రత్యేక తరగతి గదులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని,ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలకు కాంపౌండ్ వాల్ అవసర నిమిత్తమై నాల్గున్నర లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.గ్రామంలో ముస్లిం సోదరులకు షాదిఖాన అవసరం నిమిత్తమై ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు వెంటనే స్థలం చూపించి నిర్మాణం చేపట్టుటకు నిధులు మంజూరు చేయించి ముందుకు రావడంతో ముస్లిం సోదరులు హర్షధ్వనులతో పెద్దఎత్తున ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఎంపిపి వై.రాజారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందత్వ నిర్మూలనకై ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి “వెలుగు కార్యక్రమం”త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సోమేశ్వర్ రెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్,రంగన్న పంచాయితీ కార్యదర్శి,రాజేష్ ఏఎన్ఎం శేఖమ్మ,ఆశా వర్కర్లు,మాజీ కో ఆప్షన్ సభ్యుడు అహమ్మద్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.