Thursday, 5 November 2026

కంటి వెలుగుల తనిఖీ చేసిన నోడల్ అధికారి

 

టేకులపల్లి,జనవరి 20 (జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని సులానగర్ పిహెచ్సిలో నిర్వహిస్తున్న రెండో కంటి వెలుగు కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కంటి వెలుగు నోడల్ ఆఫీసర్ డాక్టర్ మణికంఠ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.కంటి వెలుగు కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమాన్ని తనికీ చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్,కంటి వెలుగు వైద్యాధికారులు పావని, ప్రసన్న,సనత్ కుమార్, ఫాతిమా, మంజీలాల్, కమ్యూనిటీ ఆఫీసర్ సీతమ్మ, పబ్లిక్ హెల్తీ నర్సు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.