అధికారులతో మంత్రి అయ్యన్న పాత్రుడు సవిూక్ష
హైదరాబాద్,మార్చి2(జనంసాక్షి): వేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్దం చేయమని పంచాయితీరాజ్, ఆర్.డబ్ల్యు.ఎస్ ,ఎన్ ఆర్ జి ఎస్ శాఖమంత్రి
చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలలల్లో ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్యులు పంచాయితీరాజ్, ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులతో సచివాలయంలో సవిూక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కోనేందుకు 40 కోట్లు విడుదల చేస్తున్నామని, వీటితో వాటర్ ట్యాంకులు,పైపులు, బోర్లు వంటివి రిపేర్లు చేపించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. అదే విధంగా కరువు జిల్లాల్లో పర్యటించేందుకు ప్రత్యేకంగా సిఈలతో పర్యవేక్షణ బృందాలని ఏర్పాటు చేయాలని, ప్రతి పదిహేను రోజులకోకసారి నివేదిక అందించాలని ఆదేశించారు. నీటి ఎద్దడి, పంచాయతీల్లో అభివృద్ధి పనులపై సవిూక్షించారు. విద్యుత్ ఆదా కోసం 659 మేజర్ పంచాయతీల్లో ఎల్‌ఈడీ బల్బులు అమరుస్తున్నట్లు ఆయన తెలిపారు. చెత్త తరలించేందుకు మేజర్ పంచాయతీలకు వాహనాలు కేటాయిస్తామన్నారు. పంచాయితీల్లో కరెంట్ పొదుపు చేసేలా అవగాహన కల్పించాలని, మొదటి విడతలో 659 మేజర్ గ్రామ పంచాయీతీలలో ఎల్.ఇ.డి. బల్బులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. అదే విధంగా ప్రతి పంచాయితతీ బిల్డింగ్ కి కరెంట్ విూటర్ ఏర్పాటు చేయాలని తద్వార విద్యుత్ బకాయిలు ఉండవని అయ్యన్న పాత్రుడు చెప్పారు. మేజర్ గ్రామ పంచాయితీల్లో చెత్త తరలించేందుకు హైడ్రాలిక్ సిస్టం ఉన్న వాహనాలు కొనుగోలు చేసే యోచనలో ఉన్నామని దీని కోసం ఓకమిటీ వేయనున్నట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. కేంద్రప్రభుత్వం రాష్టాన్రికి కేటాయించిన నిధులపై, రద్దు చేసిన పధకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈసవిూక్షా సమావేశంలో పంచాయితీరాజ్ సెక్రటరి జవహార్ రెడ్డి, పంచాయితీ కవిూషనర్ రామాంజనేయులు, ఆర్.డబ్ల్యు.ఎస్ సి.ఈ రవిబాబు తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.




