గ్రామాల్లో మావోల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మహా ముత్తారం డిసెంబర్ 03 (జనం సాక్షి) పలు పల్లె గ్రామాలలో మావోల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మహా ముత్తారం మండలంలోని శనివారం రెడ్డిపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంనిర్వహించడం జరిగింది. డిసెంబర్ 2 నుండి 8 వ తేదీ వరకు పి ఎల్ జి ఏ వారోత్సవాలు జరుగుతూ ఉన్నందున పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది.
_మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా మండలంలోని గ్రామాల్లో మావోల కదలికల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే వెంటనే అడవి ముత్తారం పోలీసులకు, లేదా 100 డయల్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలి.. మావోయిస్టులకు, మావోల సానుభూతిపరులకు ప్రజలు ఎవరు సహకరించొద్దు అని గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల సమాచారం అందించిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్ఐ రమేష్ తెలిపారు . అలాగే కనకనురు నుంచి రెడ్డిపల్లి వైపు గల కల్వర్టులన్నీ క్షుణ్ణంగాచెక్ చేశారు.




