Thursday, 5 November 2026

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట జిఎంఆర్ ఐ డి ఏ గడ్డపోతారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు

 

 

 

 

 

 

జిన్నారం మే 18 (జనంసాక్షి)సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం ఐడిఏ గడ్డపోతారం పంచాయతీ పరిధిలోని దాచారం, కృష్ణాయ్య పల్లి, అలీనగర్ల గ్రామాలలో సుమారు రెండు కోట్ల 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినితో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గురువారం శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు!! అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే గుడమయిపాల్ రెడ్డి మాట్లాడుతూ అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహకారంతో సిఎస్ఆర్ నిధులను కేటాయిస్తూ గ్రామాలను అభివృద్ధి ప్రతికలుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రకాశ్ చారి, ఉపసర్పంచ్ వెంకటేష్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు,పంచాయితీ సభ్యులు, మాజీ పంచాయతీ ఉపసర్పంచ్ ఓంకార్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ ఈవో, పంచాయతీ సిబ్బంది తదిరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.