సీసీ రోడ్డు, మైనారిటీ కమ్యూనిటీ హాల్ కి భూమి పూజఅలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహంఇటిక్యాల జనంసాక్షి జనవరి 29 : అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరచడమే ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆర్. గార్లపాడు గ్రామంలో స్థానిక సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి. యం అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్బంగా సీసీ రోడ్డు నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.5 లక్షలు, మైనారిటీ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి సీడీపీ నిధులు నుంచి రూ.5 లక్షల వ్యయంతో భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశ అభివృద్ధి కూడా బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. అలాగే గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని, కొత్త గార్లపాడు గ్రామంలో విద్య బోధనకు ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సర్పంచ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే చరవాణి ద్వారా కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే జిల్లా విద్యాధికారితో మాట్లాడి ఉపాధ్యాయులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు డాక్టర్ వి. ఎం అజయ్, వడ్డేపల్లి జడ్పిటిసి కాశపోగు రాజు, సర్పంచులు మధు నాయుడు, మల్లన్న, రాముడు, ఈదన్న, ఇటిక్యాల ఎంపీటీసీ యుగంధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, మహమ్మద్ హుస్సేన్, ప్రభుదాస్, ఈదన్న నాయుడు, సుంకన్న మరియు గ్రామస్తులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు




