Tuesday, 3 November 2026

జూలూరుపాడులో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

 

 

 

జూలూరుపాడు, జనవరి 29, జనంసాక్షి: మండల పరిధిలోని గుండెపుడి, అనంతారం గ్రామాలలో మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్, గుండెపుడి వాసి కాళ్ళూరి యతిరాజ్ కుమార్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. యతిరాజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. అనంతరం అదే గ్రామంలో ఇటీవల కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ గుమస్తా సిరోజు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించి, సంతాపం వ్యక్తం చేశారు. మృతుని భార్య, పిల్లలను ఓదార్చి అండగా ఉంటానని మనోధైర్యాన్ని ఇచ్చారు. అనంతారం గ్రామంలో ఓ శుభ కార్యక్రమానికి పొంగులేటి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదనరావు, దారావత్ రాంబాబుతో పాటు పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.