పెన్ పహాడ్ జూన్ 14 (జనం సాక్షి) : గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని దోసపహడ్ గ్రామంలో సి ఎస్ ఆర్
నుండి విడుదలైన నిధులు 10 లక్షల రూపాయలతో వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ వ్యాయామ శాల ను ప్రారంభించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తరువాతనే గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నమని గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోలేదని గ్రామాలే రాష్ట్రనికి, దేశానికి పట్టుకొమ్మలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి ఏదో రకంగా ఆర్ధిక సాహయాన్ని అందిస్తున్నారని అందుకే దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్ర0 గా ఏర్పడిందని అన్నారు అనంతరం షేక్ సయ్యద్ కుమారుని వలిమ డిన్నరలో పాల్గొని నూతన వధూవరును ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంగరి సుధాకర్, బి ఆర్ ఏస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యూగేందర్, టిఆర్ఎస్ నాయకులు మామిడి అంజయ్య అన్నారం బ్రిడ్జి సర్పంచ్ మీసాల రమణ దేవయ్య,మండల కోఆప్షన్ సభ్యులు షేక్ రఫీ,నాయకులు తూముల ఇంద్ర సేన రావు,మామిడి అంజయ్య, పొదిలా నాగార్జున,సింగిల్ విండో డెరైక్టర్ మేకల శ్రీనివాస్,చెన్ను శ్రీనివాస్ రెడ్డి, ,ఉప సర్పంచ్ రాంబాబు, బి ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జగన్ దంతాల వెంకటేశ్వర్లు,వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం మంత్రి జగదీశ్ రెడ్డి




