. జనం సాక్షి దుబ్బాకశతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలిదుబ్బాక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి..దుబ్బాక నియోజకవర్గంగ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది యువకులు వివిధ క్రీడా రంగాల్లో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని. వారికి తగిన ప్రోత్సాహం కల్పించి మండల జిల్లా రాష్ట్ర స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తామని దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిరుదొడ్డి మండల కేంద్రంలో నియోజకవర్గస్థాయి వాలీబాల్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడా నైపుణ్యం పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గ్రామ గ్రామాన క్రీడా మైదానం ఏర్పాటు చేసిందని. హాయ్ గ్రామాల్లో యువకులు సద్వినియం చేసుకోవాలని సూచించారు. ఎంతో మంది క్రీడాకారులు నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థికంగా లేకపోవడంతో వారు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆయన గుర్తు చేశారు. ప్రతిభ క్రీడాకారులకు ప్రజాహిత ఫౌండేషన్ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని. క్రీడాకారులు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే నీ వర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ప్రతి మండల కేంద్రంలో యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు వాలీబాల్ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయిలో క్రీడాకారులు రాణించాలని ఉద్దేశంతోనే వాలీబాల్ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం లో అనేక మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ ఆర్థికంగా వారు ముందుకు సాగలేక పోతున్నారని వారికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ సందర్భంగా తాము గ్రామ గ్రామాన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రచార రథయాత్ర ద్వారా సంక్షేమ పథకాలు తెలిపే విధంగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ఆడి మన నియోజకవర్గానికి మంచి పేరు తేవాలన్నారు. మండల పార్టీ అధ్యక్షులు తోట అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నంట బాపిరెడ్డి, యువజన నాయకులు కుమార్, బైరయ్య, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, సింగర్ బోయిన స్వామి, బాసం నరసింహారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి వాలీబాల్ నిర్వాహకులు తోట వెంకటరెడ్డి, రాయపోల్ స్వామి, దేవరాజ్, యువకులు తదితరులు పాల్గొన్నారు
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే.




