Thursday, 5 November 2026

రజకులు లక్ష ఆర్థిక సాయానికి దరఖాస్తులు చేసుకోండి: సత్యనారాయణ

 

 

 

 

 

 

 

 

 

వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 10..మండలంలోని అన్ని గ్రామాల రజక కులస్తులకు ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయం పొందడానికి ఈనెల 20 తారీకు లోపు దరఖాస్తులు చేసుకోవాలని రజక సంఘం మండల అధ్యక్షులు ఎలిమినేటి సత్యనారాయణ రజకులను కోరారు శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలలోపు కలిగి ఉండాలని వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాలలో ఒక లక్ష 50 వేలు. పట్టణ ప్రాంతాలలో 2 లక్షలు కలిగిన వారు అర్హులని ఈ ఆర్థిక సాయం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వబడుతుందని అన్నారు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు. కుల ఆదాయ ధ్రువీకరణ పత్రం. ఆధార్ కార్డు. రేషన్ కార్డు. బ్యాంకు పాస్ బుక్. పాస్ ఫోర్ట్ సైజ్ ఫోటో. కాపీలను జతపరచాలని సూచించారు.